చంద్రబాబుతో పవన్ కు ప్లస్సా? మైనస్సా
తాజా పరిస్ధితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందు నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో గతంలోలా ఒంటరిగా పోటీ చేయడం, లేదా బీజేపీతో కలిసి వెళ్లడం, లేదా టీడీపీ-బీజేపీతో కలిసి వెళ్లడం, లేదా కేవలం టీడీపీతో మాత్రమే కలిసి వెళ్లడం ఉన్నాయి. వీటిలో ఒంటరి పోటీ అసాధ్యమే. అలాగే బీజేపీని వదిలేసి కేవలం టీడీపీతో మాత్రమే కలిసి పోటీ చేయడం కూడా అసాధ్యమే. దీంతో టీడీపీ-బీజేపీని కలుపుకుని వెళ్లేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీని ప్రస్తుతానికి వదిలేసి రమ్మని అడుగుతోంది. దీంతో పవన్ చంద్రబాబుతో కలిసి వెళ్లడం ప్లస్సా లేక మైనస్సా అనే అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ మూడేళ్ల పాలన తర్వాత ఆ పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకునే విషయంలో టీడీపీ కంటే జనసేనే ముందుందున్న సంకేతాల నేపథ్యంలో పవన్ ఆలోచనలు మారుతున్నాయి.
మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా పవన్ కు సీఎం పదవి కనీసం షేరింగ్ విధానంలో అయినా ఇవ్వకపోతే చంద్రబాబుతో కలిసి వెళ్లడం అనవసరం అనే భావనలో ఉన్నారు. పవన్ సీఎం అవుతారంటేనే ఈసారి జనసేన నేతలు, కార్యకర్తలు దూకుడుగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ చెప్పినట్లుగా చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పవన్ వ్యూహాలు ఈ దిశగా ఉండాలనే వాదన పెరుగుతోంది..
Comentários