చంద్రబాబు నాయుడు విడుదల కావాలంటూ చిట్వేలి టిడిపి నాయకులు ప్రత్యేక పూజలు.
ఈ రోజు చిట్వేలి మండల కేంద్రం నందు తెలుగు దేశం మరియు జనసేన ఉమ్మడి కార్యాచరణ లో భాగంగా కాకర్ల నాగార్జున నాయుడు,మాదాసు నరసింహా ఆధ్వర్యంలో స్థానిక సత్తెమ్మ గుడి దగ్గర "అరాచక ప్రభుత్వం పోవాలి చంద్ర బాబు బయట కి రావాలి" అనే నినాదం తో మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.
కూటమి భాగస్వామి నాయకుడు పవన్ త్వరగా జ్వరం నుంచి కోలుకుని ఉమ్మడి కార్యాచరణ దిశా నిర్దేశం చేసి చంద్రబాబు చేదోడుగా నిలబడాలని రాష్ట్రాన్ని జగన్ కబంధ హస్తం నుంచి రక్షించి 2024 లో కూటమి అధికారం లోకి రావాలనీ చంద్రబాబు,పవన్ కుటుంబ సభ్యుల పేర్లతో అర్చన పూజలు జరిపించారు.
ఈ కార్యక్రమం లో తెలుగు దేశం మాజీ మండల అధ్యక్షులు లారీ సుబ్బారాయుడు, బాలు రామాంజనేయులు, కాకర్ల కోటేశ్వరరావు, దేరంగుల వెంకటేష్, బోయపల్లి నరసింహులు, బుంగటావుల ప్రభాకర్, మాచినేని సుబ్బారాయుడు, మాదాసు శివ, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని జగన్ కి మంచి బుద్ది ప్రసాదించాలని శ్రీ సత్తెమ్మ దేవత ని కోరుకున్నారు.
Comentarios