సంతకాల సేకరణ కార్యక్రమం లో టిడిపి నాయకులు
నందలూరు మండలంలోని టిడిపి నాయకులు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నీ అక్రమ కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినందుకు ఆయనకు బెయిల్ రావాలని మండల కేంద్రము అయిన బస్టాండ్ కూడలి లో స్థానిక నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం లోనికి వచ్చినపుడు నుండి ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశ్యం తో టిడిపి నాయకులు పైన అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని, అదే కోవ లో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై కూడా ఆధారాలు లేని కేసు లను పిట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలను భయ్యా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని అన్నారు. ఇది చాలా కాలం నడవద్దు అని ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరి అయిన సమయం లో అధికార పార్టీ కి బుద్ది చెప్పుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments