పల్నాడులో మరో రాజకీయ హత్య - వేట కొడవళ్లతో దాడి - టీడీపీ కార్యకర్త జల్లయ్య మృతి (35) - అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం.
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని జంగమహేశ్వరపాడులో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. వేట కోడవళ్ళతో నరకటం తో కంచర్ల జల్లయ్య (35) మృతి చెందాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జల్లయ్య గ్రామం వదిలి మూడేళ్లుగా గురజాల మండలం మాడుగుల గ్రామంలో బతుకు తెరువు నిమిత్తం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
శుక్రవారం దుర్గిలోని ఓ బ్యాంకు లో పని ముగించుకొని ద్విచక్ర వాహనం పై బంధువుల శుభకార్యానికి శుభలేఖలు అందించటానికి జంగమహేశ్వరపాడు వెళుతుండగా మార్గం మధ్యలో ప్రత్యర్థులు వెంబడించి దాడికి పాలపడ్డారు. ఈ దాడిలో మరో ఇద్దరు ఎల్లయ్య , బక్కయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా జల్లయ్య ను ఒక ఆటోలో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పల్నాడు పోలీసు యంత్రాంగం ఆ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. మిగతా ఇద్దరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జల్లయ్య కుంటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తి అండ - రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
జంగమహేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను వైసీపీ రౌడీమూకలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తో పాటు మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ జూలకంటి బ్రాహ్మనంద రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షన్ వైఖరిని నరనరనా నింపుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు మృగాల కంటే హీనంగా తయారై..మనుషుల ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జల్లయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, హత్య చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి హింసాఖాండకు పాల్పడుతున్న వైసీపీ అరాచక శక్తులు ముందు భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించక తప్పద అని హెచ్చరించారు...!!
Comments