వసంతపేటలో టిడిపి కార్యాలయం ఏర్పాటు
కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరులో టిడిపి జోష్ అందుకుంది, నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు అధిష్టానం టికెట్ ఎవరికి ప్రకటిస్తుంది అనే ఉత్కంఠ నెలకొన్న, ఎవరికి వారు టికెట్ తమకే అని ధీమా వ్యక్తం చేస్తూ వారి వర్గాన్ని కూడగట్టుకుని పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం స్థానిక 26వ వార్డు మాజీ కౌన్సిలర్ సీనియర్ టీడీపీ నాయకుడు సీతారామి రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివసిస్తున్న 32వ వార్డ్ నందు టీడీపీ కార్యాలయం ప్రారంభించారు. మున్సిపల్ రోడ్డు నుండి పెద్దయెత్తున నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా మునిసిపల్ కార్యాలయం మీదుగా వసంతపేట నందు ఏర్పాటు చేసిన నూతన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసుల రెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఇది టీడీపీ కి శుభపరిణామం అని, మేము కూడా ఈ ఎన్నికలకు సంసిద్ధం అని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కడప జిల్లా వ్యాప్తంగా టీడీపీ సీట్లు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తన తండ్రి చేసిన అభివృద్ధిలో కనీసం 5 శాతం అభివృద్ధి కూడా సాహించలేదని, యువత నిరుత్సాహం గా ఉన్నారని, నిత్యావసర, గ్యాస్, కరెంట్ బిల్లులు పెరిగాయని, రైతుల కు గిట్టుబాటు ధర లభించటంలేదని, గత టిడిపి హాయాంలో రైతులను తమ ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. జగన్ తట్ట బుట్ట కట్టుకొని ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైందని అన్నారు, కడప ఎంపి స్థానం కూడా తాము కైవసం చేసుకొనున్నామని, టీడీపీ జనసేన కలయికలో నాయకులను కార్యకర్తలను కలుపోని వెళ్లి దాదాపు 150 నియోజకవర్గాలలో విజయకేతనం ఎగురవేసే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు. వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారని వారికి ఓటు వేయవద్దు, టీడీపీ కి ఒక అవకాశం ఇవ్వని కోరారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ 2 న్సంవత్సరాల క్రితమే తను అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారని అన్నారు, ప్రొద్దుటూరు నియోజకవర్గ టికెట్ విషయంలో పొత్తులు కరారు అయ్యాక అభ్యర్థిని ప్రకటిస్తారని, ఆశావహులు పెరగటం సహజమేనని అన్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది అని వెల్లడించారు. రానున్న తమ ప్రభుత్వంలో జాతీయ రహదారులు, రైలు మార్గాలు, స్టీల్ ప్లాంట్ సాధన కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, ఇక్కడి కార్యాలయంలో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరిస్తారని, ఎమ్మెల్యే దౌర్జన్యాలకు అడ్డు కట్ట వేసేందుకే ఇక్కడ కార్యాలయం ప్రారంభించామని తెలిపారు. టిడిపి జెండా ప్రొద్దుటూరులో త్వరలో ఎగరబోతోందని అన్నారు. వైసీపీ కౌన్సిలర్లు అసహనంతో ఉన్నారని, రానున్న ఎన్నికలలో తాను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు, గెలిచి తన సత్తా చాటుతానని తెలిపారు. వైసీపీ ఇక్కడి టీడీపీ నాయకులలో అసంతృప్తిని అనైఖ్యతను రగిలించే ప్రయత్నం తాము తిప్పికొడతామని అన్నారు. రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం, నియోజకవర్గంలో టీడీపీ గెలవటం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు.
మాజీ కౌన్సిలర్ సితారామి రెడ్డి మాట్లాడుతూ, కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేశారు.
תגובות