కరెంట్ కోతలపై చిట్వేలు లో బారీ ర్యాలీ నిర్వహించిన టిడిపి - చార్జీల బాదుడు ఏమిటని ఎద్దేవా - విద్యుత్ అధికారి చలపతి కి వినతి పత్రం.
గత కొద్ది రోజులుగా కరెంటు చార్జీల పెంపుతో పాటు కరెంటు కోతలతో అటు రైతులను, ఇటు ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తూ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. ఈరోజు సాయంత్రం రైల్వే కోడూర్ టీడీపీ ఇంచార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు, చిట్వేలి మండల బాధ్యులు కె కె చౌదరి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు నిరసన వ్యక్తం చేస్తూ, ధర్నా నిర్వహించి మండల విద్యుత్ అధికారి చలపతి కి వినతి పత్రం అందించారు.
వారు మాట్లాడుతూ కరెంటు కోతలతో అందరిని బాధలకు గురి చేస్తున్న వైసిపి ప్రభుత్వం... గతంలో టిడిపి పాలనలో రైతులకు, ప్రజలకు పూర్తిస్థాయిలో విద్యుత్ అంది నప్పటికీ..గగ్గోలు పెడుతూ బురద చెల్లిందని ఆ విషయాలన్నీ మరచి రైతులకు తొమ్మిది గంటలు, ఇతరులకు 24 గంటలు విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి హామీలన్నీ గాలిలో కలిపిందని, చేతివృత్తులు, స్వయం ఉపాధి, విద్యార్థులు, రైతులు ఇలా సమస్త వ్యవస్థ విద్యుత్ పైన ఆధారపడి ఉందని అట్టి దానిని విస్మరిస్తే..అన్నీ గమనిస్తున్న ప్రజలే సమాధానం ఇస్తారని అన్నారు.
అసలే ఎండాకాలం ఉక్క పోత తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలు, పెద్దవారు కరెంటు లేక నిద్ర లేక అనారోగ్యాలు పాలవుతున్నారని... పరిమితి శ్లాబ్ లను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు జిల్లా అధ్యక్షులు పెరుగు కృష్ణయ్య, టిడిపి మహిళా నాయకురాలు అనితా దీప్తి, కటికం సునీత, మాజీ ఎంపిటిసి కట్టా లోకేష్, మండల లీగల్ సెల్ అధ్యక్షుడు నాయని బాలాజీ, మాజీ మండల అధ్యక్షులు ఏడోటి రాజశేఖర్, పార్లమెంట్ టిడిపి నాయకులు నాగయ్య యాదవ్, బాలకృష్ణ యాదవ్, అనంతయ్య యాదవ్, సుబ్రమణ్యం యాదవ్, గుండాలయ్య యాదవ్, బాబు యాదవ్, మాజీ సర్పంచ్ పురం రమణయ్య, మండల మైనారిటీ నాయకులు షేక్ షబ్బీర్, కరీం భాషా, ఎంపిటిసి పెంచలయ్య, మండల ఎస్.సి సెల్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, మండల టిడిపి నాయకులు వెంకటేశ్వర రాజు, రాయపు వెంకట సుబ్బయ్య గౌడ్, గూడూరు నాగరాజు, కస్తూరి శ్రీధర్, దుగ్గిన వెంకటయ్య, కొండపనేని సుబ్బరాయుడు, ఎదోటి సందీప్, అజయ్ వర్మ, మాచిన హరినాథ, మద్దిన కోటయ్య మరియు రైతులు, ప్రజలు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments