వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయం నందు నేడు ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి.ఎస్ ముక్తియార్ మాట్లాడుతూ పట్టణములో త్రాగునీరు, దోమలు, ట్రాఫిక్ లాంటి వివిధ సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశంలో ప్రజల సమస్యపై చర్చించకుండా, పారిశుధ్య సమస్యలను సైతం గాలికి వదిలేశారని. కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఇలా చెప్పులతో అసభ్య పదజాలంతో దాడులు చేసుకోవటం తగదన్నారు. పోలీసులు ఉండగానే ఇలా భౌతిక దాడులు చేసుకోవటం పై ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా లో ప్రసారమయిన వీడియోల ఆధారంగా సుమోటోగా కేసును నమోదు చేయాలని కోరారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జి జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణములో అసాంఘిక కార్యక్రమాలు అధికమాయ్యాయని, వైసీపీ కౌన్సిలర్ ఇర్ఫాన్ పై దాడి దురదృష్టకర సంఘటన అని, ఇర్ఫాన్ తన వార్డు అభివృద్ధి పనులకు రెండు లక్షల రూపాయలు కేటాయించమని కౌన్సిల్ సమావేశంలో అడిగినందుకు దాడికి పాల్పడటం ఏమాత్రం న్యాయమని దుయ్యబట్టారు. కౌన్సిల్ సమావేశంలో దాడి జరుగుతుండగా బయటి వ్యక్తులు పోలీసులు ఉండగానే ఎలా కౌన్సిల్ హాల్లోకి వెళ్లగలిగారని, వీరందరిని మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమయిన వీడియోల ఆధారంగా గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరారు.
ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వి.ఎస్. ముక్తియార్, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి, టి.ఎన్.టి.యు.సి కడప జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్, భోగాల లక్ష్మి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comentarios