పెరిగిన బస్సు మరియు విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలనీ కదం తొక్కిన టిడిపి నాయకులు - బస్సు ఎక్కుదామనుకున్నా బాదుడే అంటూ ఎద్దేవా.
చిట్వేలు స్థానిక ఆర్టీసి బస్టాండ్ దగ్గర రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు,స్థానిక టిడిపి మండల అధ్యక్షుడు కె కె చౌదరి ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్, బస్సు చార్జీలపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా విద్యుత్ మరియు బస్సు చార్జీలు పెంచుతూ మధ్యతరగతి నిరుపేద జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు.
మూడు సార్లు బస్ చార్జీలు పెంచి బస్సు ప్రయాణం కూడా భారం చేస్తూ... ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకుంటూ పరిపాలన సాగిస్తున్నారని ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఎన్నడూ చూడలేదని వారన్నారు. తక్షణమే పెంచిన చార్జీలు ఉపసంహరించుకోవాలని లేనిచో ప్రజల తరుపున పోరాటం ఉదృతం చేస్తామని తెలియజేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో, నాగరాజ యాదవ్, పులెల రమేష్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అనిత దీప్తి, వెంకటేశ్వర రాజు, మాజీ సర్పంచ్ లు పెంచల్ రెడ్డి, పురం రమణయ్య, తమ్మిసెట్టి శ్రీను, బాలక్రిష్ణ యాదవ్, పెద్దూరు రాజా, మాద్దిన కోటయ్య, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, కరీం భాషా, వెంకటేశ్వర రాజు, శ్రీధర్ నాయుడు, మండల బి.సి సెల్ అధ్యక్షుడు గుండాల యాదవ్, బుర్రు సుబ్రమణ్యం యాదవ్, రామచంద్ర యాదవ్, రమణ, అజయ్ వర్మ, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Comments