కడప జిల్లా, ప్రొద్దుటూరు
శనివారం ఉదయం ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే ఎక్సిబిషన్ రేట్ల పెంపుపై స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించి 11 గంటలకు ఎక్సిబిషన్ దగ్గరికి బయల్దేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు. అడ్డుకున్న పోలీసులు, పోలీసులను కూడా లెక్క చేయకుండా దూసుకుపోయిన టీడీపీ శ్రేణులు, సవాల్ విసిరి ఎందుకు పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్న టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు. టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద నుండి కూరగాయల మార్కెట్ వరకు పోలీసులను తోసుకుంటూ వచ్చిన టీడీపీ శ్రేణులు. రొప్ పార్టీ సహాయంతో కూరగాయల మార్కెట్ వద్ద టీడీపీ శ్రేణులు నిలువరించిన పోలీసులు. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ప్రొద్దుటూరు ప్రజలు. ఎట్టకేలకు టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రవీణ్ రెడ్డి కి అస్వస్థత మెడినోవా ఆసుపత్రిలో చేరిక.
ความคิดเห็น