వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు, స్థానిక టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన వాగ్ధానాన్ని తుంగలో తొక్కి నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందన్నారు, నిర్ణీత సమయాలలో నోటిఫికెషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని, తమ ప్రభుత్వ హయాంలో 17591 ఉద్యోగాలు కల్పించామని, కానీ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 10143 ఉదోగాలను మాత్రమే భర్తీ చేయగలిగిందని, ప్రతిఏటా డి.ఎస్.ఈ పరీక్షలు జరుపుతామని నమ్మబలికి రెండునర్ర సంవత్సరములు గడుస్తున్నా ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేకపోయిందన్నారు, తమ ప్రభుత్వ హయాంలో పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటమే కాకుండా 13.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మంది యువతకు ఉపాధి ఉద్యోగ ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు, అయితే దీనికి వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకునిరావటంలో విఫలం అయ్యిందని ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రత్యేక హోదాతో అయినా ఉద్యోగ కల్పన జరుగుతుంది అనుకున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, టీడీపీ హయాంలో ఆరు లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఇస్తే జగన్ సర్కారు వాటిని రద్దు చేసిందని, ఎస్.స్సీ ఎస్.టి బీసీ మైనార్టీ కొర్పొరేషనలకు సబ్సిడీ రుణాలు మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక 2020-21 సంవత్సరంలో దాదాపు 385 మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు. విదేశీ విద్య పధకం కూడా ప్రస్తుతం రద్దు కబడినదని అన్ని అర్హతలు ఉన్న రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకముగా మారిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగానే వెంటనే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భమగా ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 10వ తారీఖున కడపలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
top of page
bottom of page
Comments