నరహంతక పాలనకు చరమగీతం పాడదాం
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం - బత్యాల
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :
జగన్మోహన్ రెడ్డి నరహంతక పాలనకు చరమగీతం పాడాలని., ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి బత్యాల చెంగలరాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "జగనాసుర రక్త చరిత్ర బహిరంగం" అనే పుస్తకాన్ని బత్యాల ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న జిమ్మిక్కుల పట్ల ఆరోపిస్తూ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రాత్రి 3 గంటల నుంచి 4 గంటల మధ్యన అవినాష్ రెడ్డి, నవీన్, కృష్ణమోహన్ రెడ్డి లు చరవాణి ద్వారా భారతీ రెడ్డి, జగన్ రెడ్డిలతో ఏం మాట్లాడారో కాల్ డేటా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వివేకాను గంటకు పైగా చిత్రహింసలు పెట్టి అతి క్రూరంగా గొడ్డలితో నరికి హత్య చేశారని ఆరోపించారు. గొడ్డలి వేటును గుండెపోటుగా విజయసాయిరెడ్డి చేత చెప్పించారని.. సాక్షి టీవీలో స్క్రోలింగ్ ఇచ్చారని, నిందితులను దాచిపెడుతూ సాక్షి, వైసీపీ తప్పుడు ట్వీట్ చేశారని ఆరోపించారు. హత్య కేసును టిడిపికి అంటగడుతూ అవినీతి విష పుత్రిక సాక్షి పత్రిక, మీడియాలో వికృత రాతలు రాయించారని అన్నారు. హత్యలు చేయించడం, ఎదుటివారికి అంటగట్టడం జగన్ రెడ్డి నైజం అని తెలిపారు. కడప ఎంపీ సీటు కోసమే సొంత బాబాయ్ నే హత్య చేయించారని షర్మిల సంచలన వాంగ్మూలం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి నరహంతకుల చేతుల్లో మన భవిష్యత్తు క్షేమంగా ఉంటుందా అని ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comentários