చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అరగుండుతో ర్యాలీ..
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ టిడిపి యువ నాయకులు కాకర్ల నాగార్జున,జనసేన నాయకులు మాదాసు నరసింహ ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసన,ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
టిడిపి సీనియర్ నాయకులు కాకర్ల లారీ సుబ్బరాయుడు, బాలు రామాంజనేయులు, కాటూరి నరసింహులు, ఏదోటి శివప్రసాద్ లు అరగుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు. కక్షపూరిత అరెస్టును ఎండగట్టారు.
కార్యక్రమానికి విచ్చేసిన టిడిపి రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ...మచ్చలేని మా నాయకుడు అరెస్టు ఈ అరగుండుతో సమానమని అన్నారు. అరెస్టులు తప్ప ఇంకేమీ చేయలేవని ఎద్దేవా చేశారు. తప్పులు తెలుసుకుని వెంటనే చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తదుపరి వందలాదిమంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు మూడు రోడ్ల కూడలి నుంచి శివాలయం వరకు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. శివాలయంలో చంద్రబాబు నాయుడు వెంటనే విడుదలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments