టిడిపి ఛార్జ్ షీట్ విడుదల
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై ప్రొద్దుటూరు టిడిపి నాయకులు చార్జ్ షీట్ విడుదల చేశారు. నియోజకవర్గ టిడిపి కీలక నేతలు వి ఎస్ ముక్తియర్, ఈవీ సుధాకర్ రెడ్డి, ఘంటసాల వెంకటేశ్వర్లు, కామిశెట్టి బాబు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నల్లబోతుల నాగరాజు, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి, కౌన్సిలర్లు గౌస్, వంగనూరు మురళీధర్ రెడ్డి తదితరులు పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గడచిన 10 సంవత్సరాల ఎమ్మెల్యే అరాచకాలు, దుర్మార్గాలు, హత్యలు, అసత్యాలు ఎక్కువ అయ్యాయని దందాలకు అడ్డాగా ప్రొద్దుటూరు నియోజకవర్గం మారిపోయిందని ఆరోపణలు గుప్పిస్తూ, టిడ్కో ఇల్లు వద్దు అని చెప్పిన ఎమ్మెల్యే రెండు సెంట్లు స్థలంలో ఇల్లు నిర్మించి పట్టాలు, తాళంచెవి చేతికి అందించి తీరుతానని వాగ్దానం చేసి, నేడు వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక సెంటు ఇంటికే పరిమితం చేశారని, వాటిలో కూడా డబ్బులు దోచేసి కనీసం సరైన గునాదులు కూడా నిర్మించలేదని అన్నారు.
టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామని చేనేతలను మోసం చేశారని, 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వైసిపి హయాంలో ఏటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, మెడికల్ కాలేజ్ కూడా పులివెందుల తరలించారని ఆరోపించారు. కుందు పెన్నా నదుల అనుసంధానాన్ని లేవనెత్తి సాగునీరు త్రాగునీరు కొరకు ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు? బీసీల అత్యధికంగా ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను అతి కిరాతకంగా అంతమొందించారని, ఇలాంటి నేపథ్యంలో ఈ ఎన్నికలలో బీసీల ఇళ్ల వద్దకు వైసిపి నాయకులు ఓట్లు వేయమని ఎలా వెళ్తున్నారో వారికే తెలియాలని అన్నారు. ఇసుక దందాలలో వైసిపి నాయకులు కోట్లు కూడగట్టారని ఆరోపిస్తూ, ఈ ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్యే రాచమల్లుకు ప్రజలే బుద్ధి చెబుతారని అంటూ రాచమల్లు పై చార్జ్ షీట్ విడుదల చేశారు.
Opmerkingen