వెల్లడించారు! ప్రకటించారా?
సందిగ్ధంలో తెలుగు తమ్ముళ్లు...
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు సెప్టెంబర్ 15
బుధవారం సాయంత్రం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో సందడి నెలకొంది, ఆనందోత్సాహాల మధ్య ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేశారు. తమ నాయకుడు జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో నియోజకవర్గ భాద్యతలు అప్పగించిన మాట పాఠకులకు విదితమే, కాగా తజాగా బుధవారం ఆయనకు బాబు పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేస్తూ వెలువడిన వార్త అటు నియోజకవర్గ టీడీపీ నాయకులలోనూ, ఇటు కార్యకర్తలలోను సంధిగ్ద వాతావరణం ఏర్పరచింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. టీడీపీ అధిష్ఠానం సీనియర్ నాయకులను విస్మరించిందా లేక టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గతంలో చెప్పిన విధంగా యువతకు ప్రాధాన్యత నిస్తూ నిర్ణయం వెలువడించిందా అనేదే ఇక్కడ కోటి డాలర్ల ప్రశ్న?
నియోజకవర్గ నాయకులలో గతంలో అయిదు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసి నాయకుడు టికెట్ ఆశిస్తున్నాడని వార్త, గతంలో టీడీపీ టికెట్ సాధించి నెగ్గిన నాయకుడు కూడా టికెట్ ఆశిస్తుండగా, వివిధ హోదాలలో పని చేసి అటు నియోజకవర్గంలోని మైనారిటీలకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన నాయకుడు ఒకరు, మరో నాయకుడు ప్రవీణ్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. నియోజకవర్గ టీడీపీలో నాయకులకు కొదవ లేదు! అలాగని అసమ్మతులకు కొదవలేదు? బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కావటం అందునా ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గత రెండు ధపాలు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి బలమైన క్యాడర్ నిర్మించుకొని, అటు మునిసిపల్ ఎన్నకలలోను ఇటు పంచాయతీ ఎన్నికలలోను సత్తా చాటి, తనధైన శైలిలో ముందుకు దూసుకుపోతూ, ప్రభుత్వ కార్యక్రమమైన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గత మూడు నెలల నుండి ప్రజలకు మరింత చేరువ అవుతున్న నేపథ్యంలో, ఇక్కడి టీడీపీ నియోజకవర్గ టికెట్ ప్రవీణ్ రెడ్డికి ప్రకటించటం చేర్చానీయాంశంగా మారింది.
రాష్ట్రంలోని ప్రస్తుత తాజా రాజకీయాల నేపథ్యంలో పాలకపక్షమే ఆచితూచి అడుగులు వేస్తోందని, అలాంటిది దాదాపు రెండు సంవత్సరాల కాల వ్యవధి అసెంబ్లీ ఎన్నికలకు ఉండగా, మిగితా నియోజకవర్గాలలోని సీనియర్ టీడీపీ నాయకులకే టికెట్ ప్రకటించని చంద్రబాబు, తమ నాయకునికి బెర్త్ కన్ఫర్మ్ చేయటంలో ఆంతర్యం ఏమిటోనని, తమ నాయకులను ప్రజల్లోకి జొప్పించి వారి ద్వారా పాలకపక్షాన్ని బలహీన పరచటం కోసం, ప్రజల్లో టీడీపీ మైలేజ్ పెంచటం కొరకు బాబు వేసిన ఎత్తుగడగా, కొందరు నాయకులు అభిప్రాయపడుతుండగా, ప్రవీణ్ వర్గం తమ నాయకుడి అకుంఠిత దీక్ష పట్టుదల కారణంగానే అధిష్ఠానం నియ్యోజకవర్గ టికెట్ కన్ఫర్మ్ చేసిందని, రాబోవు ఎన్నికల్లో తమ సత్తా చాటి ప్రవీణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలో పాలకపక్షమే ప్రతిపక్షమై ప్రజా సమస్యలపై స్పందించిన సందర్బాలు ఇక్కడి ప్రజలు గమనించారని, గడప గడప ద్వారా ప్రజలకు మరింత చేరువై ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి తక్షణమే స్పందిస్తున్న తమ నాయకుడికి రాబోవు ఎన్నికల్లో గెలుపుకు ఎటువంటి ఢోఖా లేదని, మునుపటికంటే అత్యధిక మెజారిటీతో తమ నాయకుడు గెలిపించుకుంటామని పాలకపక్షం వైసీపీ నాయకులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా రాబోవు ఎన్నికలు నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకమే.
Comments