మహిళలను రక్షించడంలో ప్రభుత్వం విఫలం - రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు
ప్రొద్దుటూరు, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి మహిళలపై రాష్ట్రంలో రోజు ఏదో ఒక్కచోట దాడులు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, మహిళలను రక్షించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు విరుచుకు పడ్డారు. ఇటీవల శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని అయిన తేజస్విని పై జరిగిన దారుణాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలను అణచి వేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా గా విఫలం అయింది అన్నారు. ప్రేమ పేరుతో దుర్మార్గులు మూడు రోజుల పాటు తేజశ్వినిని నిర్బంధించి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు వత్తాసు పలకడం దారుణమన్నారు.
ఈ సందర్భంగా పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. మొన్నటికి మొన్న రేపల్లె రైల్వే స్టేషన్ లో ఒక గర్భిణీ స్త్రీ మీద అతి దారుణంగా, సభ్యసమాజం తలదించుకునేలా మానభంగం చేశారు. ఇప్పుడు గోరంట్ల మండలం మల్లేపల్లె తేజస్వినిని అతి దారుణంగా హత్య చేశారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తక్షణమే తేజస్విని ని అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుల పై కఠిన చర్యలు తీసుకుని ఆమె కుటుంబానికి 50 లక్షల పరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాజేష్ నాయుడు పలుగొన్నారు.
Comments