శ్రీ పద్మావతి హైస్కూల్లో ఉపాధ్యాయ,కృష్ణాష్టమి వేడుకలు.
చిట్వేలు గ్రామ పరిధిలోని శ్రీ పద్మావతి హైస్కూల్లో మంగళవారం కరస్పాండెంట్ లతా లావణ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ,ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సకల విద్యులకు మూలం గురువని, గురువు లేని విద్య పరిపూర్ణం కాదని, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర గణనీయమైనదని లతా లావణ్య అన్నారు. రాజకీయ, విద్యావేత్తగా సర్వేపల్లి సేవలను కొనియాడారు.
తదుపరి ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. పిల్లలు గోపికా - కృష్ణుల గా పలు రకాల సంప్రదాయ వేషలను ధరించి ఆటపాటలతో అలరించారు. వీక్షించిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరిచారు.విద్యతోపాటు పిల్లల్లో సాంప్రదాయానికి, మానసిక ఎదుగుదల కు ఈ వేడుకలు దోహదం చేస్తాయని ప్రధానోపాధ్యాయులు బాబు అన్నారు. కార్యక్రమాల విశిష్టతను పిల్లలకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నరేష్ బాబు,టీచర్ మంజుల,భాస్కర్, పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
댓글