సిపియస్ రద్దు చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, సిపియస్ రద్దు తప్ప., మరో ప్రత్యామ్నాయం అంగీకరించం. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు
వారంలో సిపియస్ రద్దు చేస్తానని హామి ఇచ్చి వారాలు నెలలు సంవత్సరాలు గడిచిన సిపియస్ రద్దు చేయకుండా రకరకాల కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యషుడు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు నేడు సిపియస్ విధానంతో తీవ్ర మనో వేదనలో ఉన్నారని వారు పదవీ విరమణ పొందిన అనంతరం గౌరవ ప్రదంగా జీవించడానికి ఇవ్వాల్సిన పెన్షన్ రద్దు చేయడంతో తీవ్ర ఆందోళనతో ఉన్నారన్నారు.
2004 నుండి మన రాష్ట్రంలో సిపియస్ విధానం అమలులోకి వచ్చిందని ఈ విధానం ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపమంటూ అప్పటి నుండి యుటిఎఫ్ దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర మరియు ఉమ్మడి పోరాటాలు,జాతీయ స్థాయిలో కూడా పలు రకాల ఉమ్మడి పోరాటాలు చేయడం జరిగిందన్నారు.
ఈ పోరాటాల ఫలితంగానే గత ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ముఖ్య మంత్రి ఓదార్పు యాత్ర మరియు ఎన్నికల సందర్భంలో మన ప్రభుత్వం వస్తే ఒక వారంలో రద్దు చేస్తానని ఉద్యోగ ఉపాధ్యాయులకు స్పష్టంగా హామి ఇవ్వడంతో సిపియస్ ఉద్యోగులందరూ ముఖ్య మంత్రి పక్షాన నిలబడ్డారని కానీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిన రకరకాల కమిటీలు వేస్తున్నారే తప్పా, రద్దు చేయక పోవడాన్ని ఉద్యోగులు తీవ్రమైన నిరాశ మరియు ఆగ్రహాన్ని కలిగి ఉన్నారన్నారు.
మాటిచ్చి వారాలకు వారాలు, సంవత్సరాలు గడిచిపోయాయనీ ఉద్యోగులు తీవ్రమైన అసహనంతో ఉన్నారు వెంటనే ఇచ్చిన మాట నిలుపుకొనుటకు సిపియస్ రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోరగర్జన పేరుతో యుటిఎఫ్ చేస్తున్న పోరాటంలో భాగంగా నేడు రెండో రోజు కడప జిల్లాలో బైక్ చేస్తున్నామని ఇప్పుడైన ముఖ్య మంత్రి స్పందించి సిపియస్ రద్దు చేయాలని, ఇతర ఏ ప్రత్యామ్నాయాన్ని అంగీకరించేది లేదన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజ మాట్లాడుతూ సిపియస్ రద్దు కై చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం పోలీసు నిర్బంధాలను ప్రయోగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఇలాంటి నిర్బంధాలను యుటిఎఫ్ లెక్క చెయ్యదని తెలిపారు.
Comments