top of page
Writer's picturePRASANNA ANDHRA

టీనేజర్లకు టీకాల్లో.. ఆంధ్రప్రదేశ్‌ టాప్‌

టీనేజర్లకు టీకాల్లో.. ఆంధ్రప్రదేశ్‌ టాప్‌


52.82 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి, ఇప్పటి వరకు 12.78 లక్షల మందికి వ్యాక్సినేషన్‌, అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 76.09 శాతం, రెండు, మూడు స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌, దేశ వ్యాప్తంగా 15–18 ఏళ్ల వారికి

మొదటి డోసు వ్యాక్సిన్‌ పంపిణీలో డోసు వ్యాక్సిన్‌ పంపిణీలో డోసు వ్యాక్సిన్‌ పంపిణీలో. డోసు వ్యాక్సిన్‌ పంపిణీలో.. డోసు వ్యాక్సిన్‌ పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌ ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే 52.82 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,89,501 మంది బాలబాలికలకు టీకా వేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ 49.2 శాతం. గుజరాత్‌ 45.29 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో 33.44 శాతం, రాజస్తాన్‌లో రాజస్తాన్‌లో 22 శాతం నమోదైంది.


మరోవైపు, రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 76.09 శాతానికి పైగా వ్యాక్సినేషన్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24.41 లక్షల మంది టీనేజర్లను గుర్తించగా వీరికి మూడు రోజులుగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కోవాగ్జిన్‌ టీకాను అందిస్తున్నారు.


గురువారం (నేటి) నుంచి సచివాలయాలతో పాటు విద్యా సంస్థల్లో కూడా ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా జనవరి 3వ తేదీన టీనేజ్‌ వారికి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 147.72 కోట్ల డోస్‌ల టీకాలను కేంద్రం పంపిణీ చేసింది.


Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page