తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల్లో ప్రశంసలందుకున్న రాజంపేట వాసులు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో శ్రీ శ్రీ కళావేదిక మరియు ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో 48 గంటల పాటు ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు జరిగాయి.
రాజంపేటకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు, కవి గంగనపల్లి వెంకటరమణ, ఇంద్రజాలికుడు యూపీ రాయుడులు ఆదివారం రాత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకుల ప్రశంసలు పొంది సన్మాన సత్కారాలు అందుకున్నారు. మే(నే)టి పద్యాలు పేరుతో గంగనపల్లి వెంకటరమణ ఆలపించిన పద్య కవితలు ఆహుతులను అలరించాయి. యూపీ రాయుడు ప్రదర్శించిన ఇంద్రజాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చేజర్ల ఇంద్ర కుమార్ రాజు, జాతీయ మహిళా అధ్యక్షులు చిట్టే లలిత, ప్రోగ్రాం కన్వీనర్ గుత్తా హరి సర్వోత్తమ నాయుడు, ఆర్గనైజర్ కొల్లి రమావతి, తెలంగాణ రాష్ట్ర శ్రీ శ్రీ కళావేదిక అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి, గాయకులు ఉదయగిరి కొండలరావు తదితరుల చేతుల మీదుగా వారు శాలువా, పూలమాల, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో ఘన సత్కారాలను అందుకున్నారు.
Comentarios