Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365
53 కోట్ల రూపాయల వ్యయంతో త్వరలో శాశ్వత కూరగాయల మార్కెట్ నిర్మాణం
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
తాత్కాలిక పురపాలక సంఘం కూరగాయల మార్కెట్ నిర్మించి నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, మార్కెట్ ఆవరణంలో వార్షికోత్సవ సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు, మార్కెట్ వర్గీయులు ఎమ్మెల్యే రాచమల్లును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించిన సందర్భంలో ఇక్కడి వ్యాపారస్తులకు అభద్రతా భావం ఉండేదని, యాబై మూడు కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత మార్కెట్ నిర్మాణానికి రాబోవు పది రోజుల్లో భూమి పూజ నిర్వహించనున్నామని, సీఎం జగన్ మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేశారన్నారు. రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంగా టీడీపీ నాయకులు మార్కెట్ పై అసత్య ప్రచారాలు చేసి వ్యాపారుల్లో అభద్రతా భావం పెంచారని, త్వరలో టెండర్ రాబోతున్న నూతన మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టిన తరువాతే రాబోవు ఎన్నికల్లో పోటీ చేస్తానని సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ జాఫర్ హుస్సేన్, సెక్రటరీ దాదాపీర్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments