విశాఖపట్నం ప్రసన్న ఆంధ్ర విలేకరి,
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన బాలింతలను సురక్షితంగా వారి ఇంటికి చేర్చేందుకు తల్లీబిడ్డల ఎక్స్ప్రెస్ ను రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శనివారం బీచ్ రోడ్ లో సబ్ మెరైన్ వద్ద ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ ఆస్పత్రిలో డిశ్చార్జ్ అయిన తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ఆ కుటుంబం పడే బాధలు అన్నీ ఇన్నీ కావని దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాహనాలకు బదులు మరికొన్ని వాహనాలను విశాఖ నగరానికి కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.
అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు అధిక శాతం పేద వారే ప్రసవంకు వస్తారని వారిని సురక్షితంగా ఇంటికి చేర్చాడానికి ఇప్పుడు ఉన్న వాహనాలు సరిపోవడం లేదని గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి జిల్లాకు ఉన్న వాహనాలు కి తోడుగా మరి కొన్ని వాహనాలను కేటాయించడం జరిగిందని ఆమె తెలిపారు. అందులో భాగంగా మన నగరంలో నేడు తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్లను ప్రారంభించడం జరిగిందని, విశాఖలో కేజీహెచ్, విక్టోరియా హాస్పిటల్ లో ప్రతిరోజు ఎక్కువమంది బాలింతలు డిశ్చార్జ్ అవుతున్నారని వారందరినీ తమ ఇండ్లకు తీసుకువెళ్లేందుకు వాహనాలు సరిపోవడం లేదని ఆయా ఆస్పత్రిలో దీన్ని అధిగమించేందుకు అందరినీ ఒకే రోజు ఒకే టైం కి డిశ్చార్జి చేయకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా బ్యాచిలర్ వారిగా డిశ్చార్జ్ చేసినట్లయితే దీనిని అధిగమించవచ్చునని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కార్పొరేటర్లు, హాస్పిటల్ డాక్టర్లు, ఇతర వైయస్సార్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments