ములకలచేరువు: తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఇంటి స్థల పట్టాలను సృష్టించి ప్రజలకు అమ్మిన కేసులో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె జడ్పీటీసీ గీత భర్త వైసిపి పార్లమెంటరీ జిల్లా రైతువిభాగం అధ్యక్షుడు మద్దిరెడ్డి కొండ్రెడ్డిని శనివారం అరెస్టు చేసినట్టు ములకలచెరువు సీఐ సురేష్‌కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వైసిపి నాయకుడు కొండ్రెడ్డి 2008లో తంబళ్లపల్లి గ్రామంలో ఇంటిపట్టాలను ఇప్పిస్తానని సుమారు ఏడుమంది వద్ద డబ్బు వసూలు చేసి అప్పటి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ స్టాంపుల ద్వారా పట్టాలు తయారుచేసి వారికి ఇచ్చాడని తెలిపారు. పట్టాలు పొందిన బాధితులు తమకు ఇంటి స్థలాలను చూపాలని స్థానిక తహసీల్దార్ భీమేశ్వరరావును సంప్రదించారు. దీంతో నకిలీ పట్టాల బాగోతం బయట పడిందన్నారు. సదరు పట్టాలను పరిశీలించిన తహసీల్దార్ భీమేశ్వరరావు విచారణ చేసి తహసీల్దార్ సంతకం ఫోర్జరీతో తయారుచేసిన నకిలీ ఇంటి పట్టాలుగా ధ్రువీకరించుకున్న వెంటనే నిందితులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసు కోవాలని ములకలచెరువు పోలీస్‌స్టేషన్ లో పిర్యాదు చేసారు.
top of page
bottom of page
Comments