అమ్మాయిని కాళ్లతో తన్నుతూ చిత్రహింసలు : సీఎం సంచలన ఆదేశాలు
దేశంలో మహిళలు, యువతులపై వేధింపులు, చిత్ర హింసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఓ గిరిజన విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హింసించాడు. కాళ్లతో తన్నుతూ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారి సీఎం వరకు వెళ్లింది. దీంతో యువకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. వివరాల ప్రకారం. జార్ఖండ్ రాష్ట్రంలో స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న గిరిజన అమ్మాయిని ఓ యువకుడు దారుణంగా కొడుతూ, కాళ్లతో తంతుంటే అతని స్నేహితులు వీడియోలు తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గిరిజన బాలికపై దాడి జరిగిన వీడియోని రజనీ ముర్ము అనే సామాజికవేత్త ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో సీఎం హేమంత్ సోరేన్‌కు చేరింది. ఈ వీడియో ద్వారా స్కూల్ డ్రెస్ ఆధారంగా ఆ అమ్మాయి పాకూర్‌లోని సెయింట్ స్టానిస్లాస్ హెచ్ఎస్ హతిమారా పాఠశాలలో చదువుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో దాడి చేసిన యువకుడ్ని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పాకుర్ డిప్యూటీ కమి. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు...!!
Comentários