రామ్ నగర్ లో భారీ చోరీ - రూ 7 లక్షలు నగదు, 4 తులాలు బంగారం అపహరణ -
రంగంలోకి పోలీసు జాగిలం
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
దొంగలు పట్టణంలో మరోసారి భారీ చోరీకి పాల్పడ్డారు. రామ్ నగర్ లో నివాసముంటున్న బట్టల వ్యాపారి చెండ్రాయుడు కుటుంబ సమేతంగా రెండు రోజులు క్రితం సుండుపల్లె లో జరుగుతున్న జాతరకు వెళ్లారు. తిరిగి సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి తలుపు బద్దలై ఉండడం చూసి ఇంట్లోకి వెళ్ళగా బీరువా పగులగొట్టి ఉండటం గమనించారు. బీరువాలో స్థలం కొనాలని దాచుకున్న రూ 7 లక్షల నగదు తో పాటు నాలుగు తులాల బంగారం, చీరలు చోరీకి గురయ్యాయి. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసు జాగిలంతో ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. వేలి ముద్రలు, జాగిలం సాయంతో దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా పట్టణంలో ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆర్ ఎస్ రోడ్డు, నలంద పాఠశాల వద్ద, వారం క్రితం సాయి నగర్ లో జరిగిన దొంగతనాలు మరువక ముందే నేడు రాంనగర్ లో చోరీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాలన్నా, వేసవిలో ఆరు బయట నిద్రించాలన్నా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పట్టణంలో జరుగుతున్న వరుస చోరీల పట్ల పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
FOR ADS PLEASE CONTACT 9908051001
Comments