విశాఖలో అర్ధరాత్రి దొంగలు స్వైరవిహారం చేశారు.
పోలీసులందరూ రాష్ట్రపతి పర్యటన బందోబస్తులో ఉండగా అదును చూసి చెలరేగిపోయారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి టైలర్స్ కొలనీలో విజయదుర్గా దేవి ఆలయాన్ని కొల్లగొట్టారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో దుండగులు ఆలయం తాళాలను కట్ చేసి, అమ్మవారి విగ్రహానికి అలంకరించి ఉన్న బంగారు పుస్తుల తాడు, సూత్రాలతో పాటుగా హుండీని దొంగిలించారు. దొంగలు బైకు మీద హుండీతో పరారవ్వడాన్ని ఓ స్థానికుడు గమనించి ఆలయ ధర్మకర్తలకు సమాచారం అందించగా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేవాలయాలలోని చోరీలు నిత్యకృత్యంగా మారడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Opmerkingen