వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలో చోరీ కేసును ఛేదించిన రురల్ పోలీసులు. గత నెల గరుడాద్రి నగర్ లో జరిగిన చోరీ కేసులో ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన రురల్ సీఐ మధుసూదన్ గౌడ్. వివరాల్లోకి వెళితే ఏప్రిల్ ఒకటవ తేదీన గరుడాద్రి నగర్లోని ఒక ఇంటికి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి, అల్మారా పగులగొట్టి బంగారు నగలు, వెండి అపహరించినది జగన్, గణేష్ లగా గుర్తించి, జగన్ అనే నిందితులను గతంలో అరెస్ట్ చేశారు.
గతంలో జానపాటి గోపాల్ పై జరిగిన దాడి కేసులో ముద్దాయి వేముల మల్లికార్జున, శిక్షను అనుభవిస్తూ జైల్లో పై పేర్కొనబడిన ముద్దాయిలు జగన్, గణేష్ లతో పరిచయం ఏర్పరచుకొని, వారిచే రెక్కీ నిర్వహిస్తూ, దొంగతనాలు చేయగా వచ్చిన సొమ్ములో సమాన వాటాదారుడిగా కొనసాగుతున్నాడు. ఇదే క్రమంలో గరుడాద్రి నగర్ లోని ఇంట్లో చోరీకి పాల్పడగా, నిందితులు మల్లికార్జునకు ఇరవై వేల రూపాయల నగదు, దొంగిలించిన ఆభరణాలు అమ్మిన పిదప డబ్బులు వాటా పంచుకొనుటకు ఒప్పందం చేసుకున్నారు. అరెస్ట్ కాబడ్డ నిందితులు వేముల మల్లికార్జున (మల్లి) వయసు 33 సంవత్సరాలు, ప్రస్తుతం అమృతా నగర్లో నివాసం ఉన్నట్లు తెలిపారు. పోలీసులు మల్లికార్జునను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి దొంగిలించి సొత్తులో అయిదు వేల రూపాయలు స్వాధీనం చేసుకొన్నారు.
Commentaires