తిమ్మాయిపాలెం ఎస్ టి కాలనీలో బోరు కు మరమ్మతులు - ఎలాంటి నీటి ఇబ్బందులు లేవన్న సర్పంచ్ బాలు.
చిట్వేలు మండల పరిధిలోని తిమ్మాయిపాలెం పంచాయతీ ఎస్టీ కాలనీలో గత కొద్ది రోజుల క్రితం మోటర్ కాలిపోవడంతో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని.. ఆయిననూ 20 మీటర్ల దూరంలో మరొక బోరు అందుబాటులో ఉన్నదని; కావున అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలుపుతూ ఈరోజు ఉదయం ఆ బోరుకు కూడా మోటర్ ను అమర్చి పూర్తిస్థాయిలో మరమ్మతులు గావించి నీటిని సరఫరా చేశామని తిమ్మాయపాలెం గ్రామ సర్పంచ్ తుపాకుల బాల నరసింహులు పేర్కొన్నారు.
ఎలాంటి పంచాయతీ నిధులు లేకపోవడంతో వ్యక్తిగత నిధులు ఖర్చు చేస్తూ వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అసలే ఎండాకాలం, ఆపై కరెంటు కోతలు మూలంగా ఒక నెల వ్యవధిలోనే పంచాయతీ పరిధిలోని పలు మోటర్లు కాలిపోవడం జరిగిందని పంచాయతీ అభివృద్ధిపై,నిధులుపై అధికారులు స్పందించాలని కోరారు.
Comments