గాజువాక ప్రసన్న ఆంధ్ర వార్త, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఒక ఇంటక్ కు మాత్రమే సాధ్యపడుతుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు.
స్టీల్ ప్లాంట్ సీడబ్ల్యూసీలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తె స్తున్నారు అని పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన 123 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేయించి కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక హక్కుల పరిరక్షణ సాధించాలంటే ఒక్క ఇంటక్ మాత్రమే ఉందన్నారు. కమ్యూనిస్టులు ఎన్నికల సమయంలో లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రి వద్ద అసెంబ్లీలో తీర్మానం చేయాలని పట్టుబట్టారు అని, అసెంబ్లీ తీర్మానం చేశాక మంచి నిర్ణయం తీసుకున్నారని ఇదే నాయకులు అన్నరన్నారు.కానీ నేటి కాలంలో ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా అవహేళన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టులు తమ కాలం గడువు కొనేందుకు ఇంటక్ పై ఆరోపణలు సరికాదన్నారు. ప్రతి ఒక్కరు విజ్ఞతతో ఆలోచించి సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. పార్లమెంట్లో బయట లోపల వైసీపీ ఎంపీలు పోరాటాలు చేస్తుంటే మిగతా వారు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల కాలంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ ఢిల్లీ వెళ్లి ఎంపీలతో కలిసి వారి మద్దతు కోరాలని వారు సంపూర్ణ మద్దతు తెలపడంతో ప్రైవేటీకరణ ఉద్యమం మరింత వేడెక్కింది అన్నారు. పరిరక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని పేర్కొన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ కమ్యూనిస్టులు పూటకో ఓ మాట మాట్లాడటం సరికాదని, గడచిన నాలుగేళ్ల కాలంలో పడుకున్నారా అని ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయానికి పోరాటాలు చేసే కమ్యూనిస్టులు కార్మిక హక్కులు కాలరాస్తే ఇక్కడ ఏం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటే తమకు ఏమీ పట్టనట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకొని నడుపుతున్నారని విమర్శించారు. ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు అండగా నిలిచిందని, ప్లాంట్ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే అన్నారు. ఈ కార్యక్రమంలో వై.మస్తనప్ప, గంధం వెంకట్రావు, బొడ్డు పైడ్రాజు , నీరుకొండ రామచంద్ర రావు, బి.మురలిరాజు, ఆనంద్ నల్లమల్ల శ్రీనివాసరావు ,డి మోహన , mn. రెడ్డి , మద్ది అప్పల రాజు , btజగదీష్ , lv రమణయ్య, గంగవరం గోపి తదితరులు పాల్గొన్నారు
Comments