అవ్వా తాతల ఆనందమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం.
----ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు.
తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2 వేల రూపాయల సామాజిక పెన్షన్ ను 3 వేల రూపాయలకు పెంచి, అవ్వా తాతల ఆనందమే లక్ష్యంగా జగనన్న పాలన సాగుతుందన్నారు ప్రభుత్వ విప్ కొరముట్ల.
శనివారం మధ్యాహ్నం చిట్వేలి మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన పెన్షన్ల పెంపు మరియు నూతనంగా ముంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రూ.3 వేల రూపాయలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెంచారని, ఇది చారిత్రాత్మకమని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టబడి విడతల వారీగా పింఛను పెంచిన ఘనత సీఎం జన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. సచివాలయాలు ద్వారా అర్హులకు పింఛన్లను పారదర్శకంగా మంజూరు చేస్తున్నారన్నారు.
కేవలం పెన్షన్ల పంపిణీకి సుమారు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిని ,చిట్వెలి మండల వ్యాప్తంగా ప్రతినెలా సుమారు 6 వేల పెన్షన్ల ద్వారా రూ.2 కోట్ల రూపాయల నగదు పంపిణి చేయడం జరుగుతుందన్నారు.సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా జనరంజక పాలన అందిస్తున్న జగనన్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి,వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనీస వేతనాల అడ్వైజరి బోర్డ్ సలహా మెంబర్ మల్లిశెట్టి వెంకటరమణ,ఎంపిపి చంద్ర, ఉప ఎంపీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి, లింగం లక్ష్మీకర్, సర్పంచ్ దండు లక్ష్మి,జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, శివా రెడ్డి,కనకరాజు, నాగేశ్వర,పోతయ్య, సుబ్బరాయుడు, సుధాకర్ , తాసిల్దారు శిరీష, ఎంపీడీవో శివరామి రెడ్డి, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments