మంత్రాలయం చేరుకున్న తుంగభద్ర డ్యామ్ వరద నీరు.
వరద నీటికి ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతులు
తుంగభద్రా నది తీరంలో ప్రత్యేక బందోబస్తు.
భక్తులు ఎవరు నదిలోకి వెళ్లకూడదని ఆంక్షలు.
పోలీసులు మఠం సిబ్బంది తుంగభద్ర నది తీరంలో బందోబస్తు.
మంత్రాలయం:
గత వారం రోజులుగా అధికంగా కురిసిన వర్షాలకు తుంగభద్ర డ్యామ్ నిండిపోయింది. దీంతో అధికారులు కర్ణాటకలోని ఒస్పేటలోని తుంగభద్ర డ్యామ్ 30 గేట్లను తీసి వరద నీటిని దిగువన తుంగభద్ర నది లోకి వదిలిన సంగతి తెలిసిందే .గురువారం ఉదయం 11 గంటల సమయంలో తుంగభద్ర వరద నీరు పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం కు చేరుకుంది. దీంతో శ్రీమఠం పీఠాధిపతులు తుంగభద్రమ్మకు విశేషం పూజలు చేసి గంగమ్మ తల్లికి స్వాగతం పలికారు. ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి మంత్రాలయం తాసిల్దార్ దేవా చంద్రశేఖర్ స్థానిక సిఐ భాస్కర్ ఎస్సై వేణుగోపాల రాజు తమ సిబ్బందితో తుంగభద్ర నది తీరాన బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద నీరు అధికంగా వస్తుండడం వల్ల రాఘవేంద్ర స్వామి బృందావనం దర్శనానికి వస్తున్న భక్తులు కాని స్థానికులు కానీ నదిలోకి స్నానానికో వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నదిలోకి వెళ్లకుండా బారికేట్లు కూడా ఏర్పాటుచేశారు. పోలీసు సిబ్బంది సిబ్బంది మఠం సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. తుంగభద్రా నది వరద నీటిని పరిశీలించిన వారిలో మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి పిఆర్ఓ వ్యాసరాచార్ వీఆర్వోలు స్థానిక సర్పంచ్ భీమయ్య ఇతర అధికారులు ఉన్నారు.
Comments