వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
స్థానిక మునిసిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో నియోజకవర్గ పరిధిలోని ఇళ్లులేని పేద లబ్ధిదారులకు టైడ్కో ఇళ్ల నిర్మాణం కొరకు మూడు పద్దతులు అవలంభించగా, చిన్నపాటి ఇంటికే లక్షలు ఖర్చు అవుతూ, బ్యాంకు రుణాల రూపేణా మరో రెండు మూడు దశాబ్దాల కాలం పడుతుండగా, ఇలాంటి పధకం వలన నియోజకవర్గ ప్రజలకు లభ్ది చేకూరకపోగా రుణ భారం పెరిగుతుందని భావింవహి నాడు లబ్ధిదారులను టైడ్కో ఇల్లు తీసుకోవద్దని చెప్పి, జగన్ ప్రభుత్వం రాగానే సొంత కల నెరవేర్చే బాధ్యత ఎమ్మెల్యే గా తనదని నాడు చెప్పిన పిమ్మట, తన మాటను విశ్వసించి దాదాపు అయిదు వేల మంది టైడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించలేదని, కాగా తొమ్మిది వందల ఎనిమిది మంది డబ్బులు చెల్లించారని తెలిపారు. ఇందుకు వారి వసతి, అవసరం ఆసరాకాగా మూడు వందల డెబ్భై ఆరు మంది అయిదు వందల రూపాయలు, నూటా ముప్పై ఒక్క మంది పన్నెండువేల అయిదు వందల రూపాయలు, నాలుగు వందల ఒక్క మంది పాతిక వేల రూపాయలు టైడ్కో ఇళ్ల కొరకు జమ చేశారని, లభ్డిదారులు ఒక్క కోటి పద్దినిమిది లక్షలా అరవై మూడు వేల రూపాయలు జమ చేయగా, అందులో పద్దినిమిది లక్షలా అరవై మూడు వేల రూపాయలు ట్రెజరీ నందు, మిగులు కోటి రూపాయలు నాటి టీడీపీ ప్రభుత్వం దగ్గరకు చేరిందని లెక్కలతో సహా తెలిపారు.
ఇదిలా ఉండగా టైడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయకపోవటం, వివాదాస్పదంగా విషయం మారి కోర్టులో వ్యాజ్యం నడవటం వలన లబ్దిదారులకు అటు ఇల్లు ఇటు కట్టిన డబ్బులు రాలేదని, కాగా నేటి వైసీపీ ప్రభుత్వ హయాంలో పై లభ్దిద్దారులకు అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. కాగా లబ్ధిదారులు తమ డబ్బులు వాపసు చేయమని అడుగగా నాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. నేడు వైసీపీ ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తాను లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడానని, ముఖ్యమంత్రి ద్రుష్టికి అయినా విషయాన్ని తీసుకువెళ్లి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపడతానని, లేని పక్షంలో తాను తన సొంత నిధులతో యాబై శాతం డబ్బులు లబ్ధిదారులకు అందచేస్తానని తెలిపానన్నారు. విషయాన్ని టైడ్కో అధికారుల దృష్టికి స్వయంగా తీసుకువెళ్లి, పలుమార్లు ఉత్తరాల ద్వారా సంప్రదించగా ప్రొద్దుటూరు మహిళలు టైడ్కో కు చెల్లించిన డబ్బులు ఒక్క కోటి రూపాయాలు మరో వారం రోజుల్లో తిరిగి మునిసిపల్ ఖాతాలో జమకానున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోవు వారం రోజుల్లో మునిసిపల్ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేసి మహిళలకు వారి డబ్బులు వారికి చెక్కు రూపేణా తిరిగి చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments