చిక్కినట్టే చిక్కి. బోను వద్దకు వచ్చి వెనుదిరిగిన పులి
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో దాదాపు రెండు వారాలుగా పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పులి సంచరించిన దృశ్యాలు మరోసారి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.అటవీ సిబ్బంది పొదురుపాక, శరభవరం, ఒమ్మంగిలో మూడు బోన్లు ఏర్పాటు చేసి పశు మాంసం ఎరగా వేశారు. నిన్న అర్ధరాత్రి తర్వాత పులి శరభవరంలో ఏర్పాటు చేసిన బోను వద్దకు వచ్చి వెనుదిరిగినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించింది.
పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవులపాలెం, పోతులూరు ప్రాంతాల్లో ఆహారం, వసతి సౌకర్యంగా ఉండటంతో పులి ఇక్కడే ఉంటూ వేటాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పులికి నాలుగైదేళ్ల వయసు ఉండి దూకుడుగా ఉన్నట్లు వారు తెలిపారు. పులిని పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ అధికారులు మరో రెండు బోన్లను ఏర్పాటు చేస్తున్నారు.
Comentarios