కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు మండలం లో పులి కలకలం తో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
పోతులూరు కొండనుండి స్థావరం మార్చిన పెద్దపులి. కాలి ముద్రలు పాండవుల పాలెం వద్ద ఫారెస్ట్ అధికారులు గుర్తించి ఆ ప్రదేశానికి మకాం మార్చారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు కొండ ఫలాల నుంచి అక్కడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండవులపాలెం వద్ద చెరువులో నీరు తాగేందుకు వెళ్ళిన పెద్దపులి పాదముద్రలు గుర్తించడంతో ఫారెస్ట్ అధికారులు నిఘా పెట్టారు.
అయినా నిన్న సాయంత్రం నుండి పులి తన పని తను చేసుకు పోతుంది. పాండవుల పాలెం వద్ద ఓ లేగదూడ ను చంపకు తిన్నట్లు ఆధారాలు దొరికాయి. అలాగే పక్కనే ఉన్న ఓమ్మంగి పోదురు పాక సమీపంలో ఓ ఆవు ను కూడా వేటాడేసింది. ఈ పెద్ద పులి వేట లో మళ్లీ మొదలైన అలజడి, భయంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Comments