శ్రీవారి భక్తులతో ప్రారంభమైన తిరుమల పాదయాత్రను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 9 : కలియుగ దైవం వైకుంఠనాధుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులతో ప్రారంభమైన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పట్టణంలోని స్థానిక టీటీడీ కల్యాణ మండపం నందు గురువారం ఉదయం 9 గంటలకు 450 మంది బాలాజీ భక్తులతో ఈనెల 15వ తేదీ వరకు సాగనున్న ఈ ఆధ్యాత్మిక శోభ పాదయాత్రను మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మిత్రుడైన వంగల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా 450 మంది తో కలియుగ దైవం ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో పాదయాత్ర సంకల్పించడం ఎంతో సంతోషం ఆనందదాయకమైందని ఇలా వెంకటేశ్వర స్వామి నీ పాదయాత్ర ద్వారా తిరుమలకు చేర్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించి తిరిగి ప్రొద్దుటూరు వచ్చి యాత్రను నిర్వహించడం ఖర్చుతో కూడుకున్నదైన దైనందిత జీవితంలో స్వామి వారిని చేరుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఇలా ఆ దేవుని కృపతో దర్శన భాగ్యం కల్పించడం ఎంతో పుణ్యకార్యమని అలానే 15 వరకు ఈ సాగే ఈ యాత్రలో వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజన సదుపాయాలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పోయిన ఏడాది దాదాపుగా 250 మందితో అప్పుడు ఇలానే పాదయాత్ర ద్వారా స్వామి దర్శన భాగ్యం కల్పించినట్లు ఈ సందర్భంగా తెలిపారు ఈ యాత్రతో స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించిన వంగల నారాయణరెడ్డి కుటుంబానికి ,స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరారు మహిళలు పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనడం ఎంతో సంతోషదాయకం, ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, కొర్రపాడు రామచంద్రారెడ్డి సర్పంచ్, శ్రీనివాసులు రెడ్డి, నాగిరెడ్డి, పుల్లారెడ్డి, పర్లపాడు మహేశ్వర్ రెడ్డి, రసూల్ గౌస్, గంటావెంకటేశ్వర్లు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు
Comments