top of page
Writer's pictureEDITOR

ఫీజుల కోసం వేధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల - టిఎన్ఎస్ఎఫ్

వైకాపా అండతో విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తున్న అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల :- టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్

సమావేశంలో మాట్లాడుతున్న వేణుగోపాల్

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం బలంతో రాజంపేటలో ఉన్న అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తుందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ రేవూరి వేణుగోపాల్ అన్నారు. సోమవారం రాజంపేట టిఎన్ఎస్ఎఫ్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన డబ్బులను తల్లులు ఖాతాలో వేస్తూ బటన్ నొక్కారని., కానీ ఏ ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకు డబ్బులు తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదన్నారు. కానీ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం పూర్తిస్థాయి ఫీజును కడితేనే పరీక్ష ఫీజులు కట్టించుకుంటామని ఒక సర్కులర్ పంపించారన్నారు. ఆ సర్కులర్లో మార్చి 24 వ తేదీలోపు కట్టకపోతే రూ 3 వేలు అపరాధ రుసుముతో కట్టాలని సర్కులర్ ఇవ్వడం చాలా దారుణం అన్నారు. కన్వీనర్ కోటాలో చేరినటువంటి విద్యార్థులు పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్మెంట్ మీదే ఆధారపడి ఉంటారని., వారిని రియంబర్స్మెంట్ రాకుండా ఫీజులు కట్టమంటే ఏ విధంగా కడతారని ప్రశ్నించారు. కన్వీనర్ కోటాలో చేరినటువంటి విద్యార్థులు ఏ ఒక్కరు కూడా విద్యా దీవెన డబ్బులు రాకుండా కళాశాలకు డబ్బులు కట్టవలసిన అవసరం లేదన్నారు. అలా కాదని కలాశాల యాజమాన్యాలు వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు అనునిత్యం టిఎన్ఎస్ఎఫ్ అండగా ఉంటుందని తెలియజేశారు. కన్వీనర్ కోటాలో చేరినటువంటి విద్యార్థులను ఫీజులు కోసం వేధించొద్దని కళాశాల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ రాజంపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి సాయి, ప్రసాద్, నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

2 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page