నాడు నేడు పథకం బూటకం నందలూరు అరుంధతి వాడ స్కూలు దానికి నిదర్శనం - టి .ఎన్. ఎస్. ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్
ఈరోజు కనీసం మెయింటినెన్స్ లేక ఉన్న పారి గోడ పడిపోవడం వల్ల స్కూల్ ఆవరణంలోకి పాములు, తేళ్లు వచ్చి చంచరిస్తూ ఉన్నాయి వీటిఅన్నిటిని చూసి గ్రామస్తులు ఆ స్కూల్ కి పిల్లల్ని ఎవరు పంపడం లేదు ఒకప్పుడు 90 మంది ఉన్న విద్యార్థులు సంఖ్య ఈరోజు కేవలం 21 మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రభుత్వమే, ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి గారు సొంత మండలం పరిస్థితి ఇలా ఉందంటే రాజంపేట నియోజకవర్గం లో ఉన్న స్కూళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలందరి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు విద్య కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల పంచాయతీ స్థాయిలో ఒక ఉన్నత పాఠశాల నియోజకవర్గ స్థాయిలో డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాల జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కళాశాల లను తెచ్చి విద్యకు ఎంతో ప్రాధాన్య ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బూటకపు మాటలు ఆపి వెంటనే నందలూరు అరుంధతి వాడలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నందలూరు సర్పంచ్ మోడపోతుల రాము, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు జ్యోతి శివ, తెలుగు యువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేష్, నాగిరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు గంధం గంగాధర్, 90వ పోలింగ్ స్టేషన్ బూతు కన్వీనర్ బూసెట్టి కిరణ్ ,హరి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comentários