(ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర విలేకరి, కృష్ణ)
కార్మిక సంక్షేమం విస్మరించిన సీఎం వై యస్ జగన్మోహనరెడ్డి వైఖరినే తీవ్రంగా ఖండిస్తున్నాం విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కునగర టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి మేడే ఉత్సవాలు, శ్రమశక్తి అవార్డు మరియు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు కూడా అందజేయడంలో సీఎం వైయస్ జగన్మోహనరెడ్డి నిర్లక్ష్యం చేయడం జరిగింది 260 కోట్లు ఖర్చుపెట్టే వైయస్సార్సీపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నాను సచివాలయ సిబ్బందికి నగదు నగదు ప్రోత్సాహం సన్మానాలు సంబరాలుగా నిర్వహిస్తున్నారు వారిని సత్కరించడం మేము తప్పుపట్టడం లేదు కానీ పురాతన నుండి వస్తున్న ఒక సిస్టమ్ మేడే ఉత్సవాలు నిర్వహించి శ్రమశక్తి అవార్డు లో ఇవ్వకపోవడాన్ని కార్మిక వర్గం బాధపడుతున్నారు గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో అన్ని కార్మిక సంఘాలకు కార్మికులకు విశిష్ట సేవలను సేవలందించిన కార్మిక నాయకులకు అందజేసేవారు , ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక శాఖ ఉన్నదో లేదో పరిస్థితి తెలియడం లేదు వారు కూడా ఏమీ పట్టించుకోవడం లేదు విశాఖను రాజధాని చేస్తామనే సీఎం ఆంధ్ర రాష్ట్రానికే పారిశ్రామిక ప్రాంతానికి ముఖ్యమైన విశాఖపట్నం జిల్లాలోనే కార్మిక శాఖ భవనం నిర్మాణం చేయకపోవడం శోచనీయం. కార్మిక శాఖ లో బ్యాక్లాగ్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని విశాఖలో కార్మికశాఖ భవనం తక్షణమే నిర్మించాలని,2019, 2020, 2021, 2022 సంవత్సరాల శ్రమశక్తి అవార్డు లు మే నెలలో ఇవ్వాల్సిందిగా టిఎన్టియుసి తరపున డిమాండ్ చేస్తున్నాము.
ఈ సమావేశంలో గాజువాక నియోజకవర్గం టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి అరుగుల మణికుమార్, స్టీల్ టిఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ కోడూరు సత్యనారాయణ, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలమండ శ్రీనివాసరావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments