చిట్వేలి లో కులమతాలకతీతంగా మొహరం సంబరాలు
-పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లిం - హిందూ మతస్తులు
--నృత్యాల తో సందడి చేసిన యువత
---శాంతి భద్రతలను పర్యవేక్షించిన ఎస్సై వెంకటేశ్వర్లు
మహమ్మద్ ప్రవక్త మనవళ్లయిన హాసన్, హుస్సేన్ నిర్జీవం పొందిన రోజుకు గుర్తుగా ముస్లిం మతస్తులు పది రోజులకు ముందుగా పీర్లను పెద్ద ఎత్తున అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించి చివరి రోజు అయిన మొహరం రోజున నిమజ్జనం చేయడం" మొహరం" పండుగ ప్రత్యేకత.
ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో ముస్లిం మతస్తులు అటవీశాఖ కార్యాలయానికి దగ్గర ఉన్న పీర్ల చావిడి దగ్గర నుంచి పీర్లను.. వివిధ రకాల పూలతో అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ యువత తమ భుజాలపై మోసుకుంటూ ప్రధాన వీధి వెంబడి వెళ్ళగా కులమతాలకు అతీతంగా హిందూ- ముస్లిం లు అందరూ పీర్లకు ప్రసాదాలను సమర్పించారు.యువత పెద్ద ఎత్తున నృత్యాలు చేస్తూ, వివిధ వేషాలు ధరించి అందరికీ దీవెనలు పంచుతూ తమ భక్తుని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం - హిందూ మత పెద్దలు, యువత, చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనగా.. స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ సిబ్బందితో కలిసి కార్యక్రమాన్ని పర్వెక్షిస్తూ విధులు నిర్వహించారు.
Comentarios