రాజకుంట గ్రామంలో... కలిసికట్టుగా కాశీయాత్ర.
--సుమారు 50 మంది ప్రయాణం.
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించినచో సకల పాపాలు తొలగును అన్న నానుడి మన హిందూ ధర్మంలో ఉంది. త్రిలోకాదిపతి పరమశివుడు పిలిస్తే పలికేటట్టి ఆ పుణ్యక్షేత్రమే కాశి క్షేత్రం.
అట్టి కాశి క్షేత్రానికి వాయోభేదం లేకుండా ఈ రోజున అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం రాజుకుంట గ్రామంలోని సుమారు 50 మంది ప్రజలు రాజుగుంట నుంచి బస్సు ద్వారా గూడూరు కి చేరుకొని ఈరోజు రాత్రికి రైలు ద్వారా కలిసికట్టుగా కాశీకి ప్రయాణమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనా దృష్ట్యా కాశీ ప్రయాణం వాయిదా పడిందని ఈ సంవత్సరంలో మేమంతా కలిసికట్టుగా ఈ యాత్రను కొనసాగిస్తూ భగవంతుని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటామని తెలిపారు. కాశీకి వెళుతున్న వారందరికీ గ్రామస్తులు జాగ్రత్తలు తెలుపుతూ క్షేమంగా తిరిగి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఒకసారి వెళ్లి వచ్చిన మాదినేని (ఆచారి) శంకరయ్య అందరిలోనూ కాశీకి వెళ్లాలన్న భావనను కలిగించడంలో చొరవ చూపారు. కాగా చదువుకున్న కూనపల్లి. శివ తదితరులు పెద్దలందరికీ మేమున్నాము మీరూ రండి అన్న భరోసా ఇచ్చారు.
Comments