శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా...
శ్రీ భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు.
--ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖులు
--పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ధర్మకర్త.
--భక్తులకు తాళ్లపాక గ్రామస్తుల అన్నదానం.
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలోని పాత చిట్వేలు గ్రామంలో వెలసిన శ్రీ వీరభద్ర స్వామి సమేత శ్రీ భద్రకాళి అమ్మవారికి ఈ రోజున శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మీ వ్రత విశేషాన్ని సంతరించుకొని.. ఆలయ పూజారులు మృత్యుంజయ శర్మ అమ్మవారికి వేకు జామునే విశేష పూజలు చేపట్టి పట్టు వస్త్రాలతో అలంకరించారు. దీప,దూప నైవేద్యాలను సమర్పించి వచ్చిన భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించి వారందరికీ తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.
కాగా కువైట్ లో క్షత్రియ సేవా సంస్థ అధ్యక్షులు మరియు తెలుగు కళాశాల ఉపాధ్యక్షులు బాలరాజు చంద్రశేఖర్ రాజు, రిటైర్డ్ వాణిజ్య పనుల అధికారి గూడూరు యానాది రాజు, దండుపాళ్యం సినీ దర్శకులు బాలరాజు శ్రీనివాసరాజు, గుజరాత్ గార్డియన్ లిమిటెడ్ సీఈవో దక్షిరాజు నరసింహ వర్మ తదితరులు ఆలయ దర్శనానికి విచ్చేయగా ఆలయ నిర్వహకులు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అర్చకులు మృత్యుంజయ శర్మ వారికి మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కాగా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామ ఎంపీటీసీ సభ్యులు మధుసూదన వర్మ, గూడూరు కుమారస్వామి రాజు, ఆర్లగడ్డ వెంకట రాజు లు సంయుక్తంగా ఈరోజు మధ్యాహ్నం భక్తులందరికీ పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు.
Comments