శ్రీ సాయి వికాస్ నందు..రేపు ఉచిత కంటి వైద్య శిబిరం.
చిట్వేలు గ్రామ పరిధిలోని శ్రీ సాయి వికాస్ పాఠశాల నందు తిరుపతి సురేంద్ర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో డాక్టర్ సురేంద్ర పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని 15 తేదీన ఆదివారం ఉదయం 9 నుంచి 1 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య తెలియపరిచారు.
కంటి సంబంధిత వ్యాధులు కంటి శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆపరేషన్లు చేయించుకోవాలనుకున్న వారు ఒరిజినల్ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, బ్యాంకు అకౌంట్ ను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఎంపికైన వారికి రవాణా ఖర్చులతో పాటు పూర్తిగా ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు. మండల పరిధిలోని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కరస్పాండెంట్ రెడ్డయ్య విజ్ఞప్తి చేశారు.
Comments