top of page
Writer's picturePRASANNA ANDHRA

రేపటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష వాయిదా

అమరావతి, రేపు అనగా 11.05.2022న జరగవలసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష 'అసాని' తుఫాను కారణంగా ఈ నెల 25.05.2022వ తేదీ నాటికి వాయిదా వేయడం జరిగింది. తుపాను కారణంగా పరీక్ష నిర్వహణ, విద్యార్థుల మరియు సిబ్బంది భద్రత దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ విద్యామండలి, పరీక్షల నియంత్రణ అధికారి నేటి సాయంత్రం పత్రికా ప్రకటనలో తెలిపారు.


గమనిక : విద్యార్థిని విద్యార్థులు తమ కళాశాల యాజమాన్య సిబ్బందిని సంప్రదించగలరు.

అసని తుఫాను దిశ మార్చుకుని మచిలీపట్నం వైపు కొనసాగుతోంది. ఈ ప్రభావం ఉత్తరాంధ్ర , తూర్పు గోదావరి, పచ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో బుధవారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరీక్ష ను ఈ నెల 25 న నిర్వహిస్తామని వెల్లడించింది.

372 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page