జరిమానాలపై అసత్యప్రచారం నమ్మొద్దు: రవాణాశాఖ
విజయవాడ
డ్రైవింగ్ చేసే సమయంలో ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకుంటే రూ.20 వేలు జరిమానా విధిస్తామనేది అసత్య ప్రచారమని ఏపీ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
మీడియాలో ఈ ప్రచారం వైరల్ అయిన నేపథ్యంలో కమిషనర్ స్పందించారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్/హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే తొలిసారి రూ.1500 - రూ.2వేలు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.
コメント