మానవత్వ విలువల్ని, రక్త సంబంధాన్ని మరచి కన్న తల్లిని, తోడబుట్టిన తమ్మున్ని, అయిదు మాసాల గర్భవతి అయిన చెల్లిని కిరాతకంగా రోకలితో బాది చంపిన మానవ మృగం ఉప్పలూరు కరిముల్లాకు ఎట్టకేలకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం.
పూర్తి వివరాలలోకి వెళితే 26-4-2021న ఉదయం సుమారు 7-45 గంటల సమయంలో ప్రొద్దుటూరు టౌన్, హైదర్ ఖాన్ వీధి 21/14 ఉప్పలూరు కరీముల్లా వయసు 34 సం కుటుంబ మనస్పర్థల నేపథ్యంలో తన కన్న తల్లి అయిన గుల్జార్ బేగం, స్వంత తమ్ముడు ఉప్పలూరు మహమ్మద్ రఫీ, గర్భవతిగా ఉన్న స్వంత చెల్లెలు షేక్ కరీమున్ లను, పవిత్ర రంజాన్ పర్వదిన మాసం రోజా కొరకు సహరి చేసి పై ముగ్గురు ఇంట్లో నిద్రిస్తున్న సమయం లో రోకలి బండతో వారి తలల పై విచక్షణా రహితంగా మోది చంపాడు. ముద్దాయి తండ్రి ఉప్పలూరు చాన్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ప్రొద్దుటూరు ఒకట టౌన్ యస్.ఐ. యం. రాజా రెడ్డి ప్రొద్దుటూరు పట్టణ PS Cr.No 16/201U/s 302 ఐపిసిల మేరకు కేసు నమోదు చేయగా, శ్రీ బి. మధుసూధన్ గౌడ్ సి.ఐ., ప్రొద్దుటూరు రూరల్ I/c Proddatur town PS విచారణ చేపట్టి ముద్దాయి కరీముల్లాను అదే రోజు ఆనగా 26-4-2021న అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
బుధవారం జిల్లా రెండవ అదనపు జడ్జి జి.యస్. రమేశ్ కుమార్ పై కేసు విచారణ చేపట్టగా, ప్రొద్దుటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాం ప్రసాద్ రెడ్డి, కేసు ప్రాసిక్యూషన్ వైపున వాదించారు, న్యాయసేవా సంస్థ ద్వారా లీగల్ ఎయిడ్ పొందిన ముద్దాయి ఉప్పలూరు కరీముల్లా తరుపు నుండి రాజేశ్వర్ రెడ్డి డిఫెన్స్ వాదనలు వినిపించారు. మొత్తం 21 మంది సాక్షుల ను విచారించిన జడ్జ్ 14-10-2022 వ తేదీన కేసులో తుది తీర్పు వెలువరించి, బుధవారం అనగా 19-10-2022 నాడు ముద్దాయి ఉప్పలూరు కరీముల్లా age 35 సం. నకు ఉరిశిక్ష ఖరారు చేశారు.
ముద్దాయి పూర్తి జ్ఞానంతో, తనకు జన్మనిచ్చిన తల్లిని, తోడబుట్టిన తమ్ముడు, అయిదు నెల గర్భం తో ఉన్న స్వంత చెల్లెలిని రోకలి బండతో మోది చంపి, తన చెల్లెలి గర్భం లో పెరుగుతున్న శిశువు మరణమునకు కూడా కారకుడైన ముద్దాయి కరీముల్లా విచారణ సమయములోగాని, శిక్ష ఖరారు సమయములోగాని తాను చేసిన ఘోరమైన హత్యల పట్ల ఏమాత్రం పశ్చాత్తాపం కనపర్చనందున ముద్దాయికి శిక్షా పరిమాణములో మినహాయింపు ఇవ్వడానికి తమకు ఎలాంటి కారణాలు కనపడనందున, ముద్దాయికి ఉరి శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పినారు.
కేసు విచారణాధికారులు బి. మధుసూదన్ గౌడ్, ఎన్ వి నాగరాజు, కె. రాజా రెడ్డి, సి ఐ ప్రొద్దుటూర్ ఒకటవ పట్టణ పి. యస్. యం. రాజారెడ్డి యస్.ఐ, కేసు విచారణలో సహకరించిన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ యస్. హెచ్. రహమతుల్లా, కానిస్టేబుల్స్ రాజేంద్ర ప్రసాద్, లక్ష్మినారాయణ లను ప్రొద్దుటూరు .ఏ.ఎస్.పి ప్రేరణా కుమార్ ఐపీఎస్ అభినందించి రివార్డులు సిఫార్సు చేశారు.
Comments