సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ టిడిపి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వానికి ఇవే మా నిరసనలంటూ చిట్వేలి మండల పరిధిలోని సి. కందుల వారి పల్లి గ్రామంలో "నిజం గెలవాలి న్యాయం గెలవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి" అన్న నినాదంతో కళ్లకు గంతలు కట్టుకుని టిడిపి సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు నాయుడు, కాకర్ల లారీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
యువ నాయకులు కాకర్ల నాగార్జున మాట్లాడుతూ
రుజువు లేని కారణాలతో అరెస్టు చేసి 50 రోజులు కావస్తున్నా నిరూపించలేని కేసులు పెట్టి మా నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిరంకుశ జగన్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, వైసిపి కుట్రలను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు ఓటుతో సమాధానం చెబుతారని ఆ రోజులు ఎంతో దూరంలో లేవని వారన్నారు. మచ్చలేని మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని, విజయం మాదేనని తమ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని మరచి కక్షపూరిత పాలన కొనసాగించడం జగన్ ప్రభుత్వానికే చెల్లిందని వారన్నారు. ఆర్థిక తిరోగమనంలో పయనిస్తున్న ఆంధ్ర రాష్ట్ర పురోగతి చంద్రబాబు నాయుడు కే సాధ్యమన్నారు.
ఈ కార్యక్రమం లో మండల టిడిపి యువ నాయకులు కాకర్ల నాగార్జున, మన్నూరు సత్యనారాయణ, కాకర్ల కోటేశ్వరరావు, ప్రణయ్, దేరంగుల వెంకటేష్, ధనంజయ, కస్తూరి చంద్రయ్య, స్థానిక సర్పెంచ్ యామల శ్రీదేవి, ఉపసర్పంచ్ బాలు రెడ్డయ్య, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గున్నారు
Comments