సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు లోని అర్ అండ్ బి అతిధి గృహం నందు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. తులసి రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 11వ తేదీన రాష్ట్ర పర్యటన చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రం లోని కొన్ని అంశాలను పరిశీలించి స్పష్టత ఇవ్వాలి ఆయన కోరారు. ఇందులో భాగంగా స్పెషల్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయాలనీ, వాల్తేరు డివిజన్ తో కూడిన విశాఖ రైల్వే లైన్ ఇవ్వాలని, కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులు వొత్తుతోందని ఆయన ఆరోపిస్తూ, రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువ అయ్యాయనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యుత్ ప్రమాదాలు అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులకు 83 కోట్ల రూపాయలు జీతాల రూపేణా వెచ్చించారనీ, మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా 'జగనన్న తాగుడు వూగుడు పథకం' లాగా రాష్ట్రాన్ని మద్యం ఆంధ్రప్రదేశ్ గా మార్చారు జగన్ అని ఆరోపించారు.
కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పిఎండి నజీర్ అహ్మద్, పలువురు కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments