వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని డ్యాములు, నదులు జలకల సంతరించుకోగా పెన్నా నది పూర్తి నీటిమట్టంతో కళకళలాడుతోంది. ఇదిలా ఉండగా, ఆదివారం సాయంత్రం పెన్నా నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు లోని త్యాగరాజ కళ్యాణ మండపం వద్ద గల పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో, ఈత కోసమని వచ్చిన ఇద్దరు యువకులు వడ్లపల్లి వసంత్ కుమార్ సన్ ఆఫ్ నరసింహులు, ఆదర్శ కాలనీ, వయసు 22 సంవత్సరాలు, తలారి కార్తీక్ సన్ ఆఫ్ రమణ, రాయచోటి, వయసు 24, ఈత కోసమని పెన్నా నదిలోకి దిగారని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈత కొడుతున్న సమయంలో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది లో వీరు గల్లంతయ్యారు.
స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి 7:00 గంటలు అవుతున్న వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కావున సోమవారం ఉదయం 6 గంటల నుండి సెర్చ్ ఆపరేషన్ వెతుకులాట మొదలవుతుందని అగ్నిమాపక శాఖ అధికారి రఘునాథ్ తెలిపారు.
Comments