వై.ఎస్.ఆర్ కడప జిల్లా, రైల్వే కోడూరు లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శుభకృత నామ నూతన సంవత్సర ఉగాది.. ప్రజలందరి కష్టాలను పాలద్రోలి శుభాలను నింపాలని, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడం అందరూ అలవాటు చేసుకోవాలని; దీని పరమార్ధమే ఉగాది పండుగ అని, జగన్మోహన్ రెడ్డి పాలన లో ప్రజలకు మరింత సేవ చేస్తూ ముందుకు వెళ్తామని తెలుపుతూ...రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీ భుజంగ ఈశ్వర స్వామి దేవస్థానం పండితులు పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణాన్ని చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేలు మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, సుధాకర్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Комментарии