గాజువాక, వాంబే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కరించుకొని వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు ఈ సంవత్సరం నుండి ఉగాది పురస్కారాలు ఇవ్వటానికి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ తీర్మానించింది వీటికోసం వివిధ రంగాలలో ప్రతిభ కలిగిన వ్యక్తుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఈ దరఖాస్తులు ఈనెల 20-03-2022 లోగా పంపించవలసినదిగా కోరుచున్నాము ఈ ప్రతిభ పురస్కారాలు పూర్తిగా ప్రతిభపై ఆధారంగా తీయడం జరుగుతుంది ఇందులో ఎటువంటి సిఫార్సులు తావు లేకుండా న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు జరుగుతాయని తెలియజేయుచున్నాము వైద్యరంగం,విద్యారంగం, జీవీఎంసీ. విద్యుత్ శాఖ, పోలీస్ రంగం, ప్రాంతీయ రవాణా శాఖ, తాసిల్దార్ కార్యాలయలు, హౌసింగ్ రంగం, ఆర్టీసీ, రిజిస్టర్ ఆఫీస్, సేవా రంగం, సాహిత్య రంగం, జుడిషియల్, క్రీడారంగం, అగ్నిమాపక శాఖ, ఎండోమెంట్, అంగన్వాడి, ఆశ వర్కర్లు, గ్రంథాలయం మీ యొక్క వివరాలు మరియు వ్యక్తిగత ప్రతిభ యొక్క వివరాలు వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దొడ్డి రమణ డోర్ నెంబర్ 13-14-34/2, కాకతీయ ఐ టి ఐ రోడ్డు బిసి రోడ్ గాజువాక లో సంప్రదించగలరు ఇందులో ఎటువంటి సందేశాలు ఉన్న సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9347663547 కు సంప్రదించవలసినదిగా కోరడమైనది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సలహాదారులు రెయ్యి విశ్వనాధ్, గౌరవ అధ్యక్షులు పెంటకోట నాగేశ్వరరావు,ఆలయ ధర్మకర్త అధ్యక్షురాలు మంత్రి మంజుల, కోశాధికారి పి.రాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రతినిధులు పాల్గొన్నారు
Comments