వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరులో ఈరోజు కొనిరెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ శుభకృత్ తెలుగు సంవత్సర ఉగాది విశిష్ట ఆత్మీయ సాహిత్య పురస్కార ప్రధాన కార్యాక్రమం ఘనంగా నిర్వహించారు, టీటీడీ కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమానికి విశిష్ట అతిధిగా మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులతో నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఇక్కడ విశేషం, తెలుగు సంవత్సరాది ఉగాది అన్నచందంగా లలిత కళలు, నృత్యా ప్రదర్శనలతో కార్యక్రమం ప్రారంభం కాగా, సంప్రదాయ ఉగాది సాహిత్య పురస్కారాల ప్రధానోత్వవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడప జిల్లా లోని యాబై మంది కవులకు పాదపూజ, విశిష్ట సన్మానం, ప్రశంసా పత్రాలు, మొమెంటోలు అందచేశారు.
ఈ సందర్భంగా శెట్టిపల్లె రఘురామి రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలో కవులకు ఒక ప్రత్యేకమయిన స్థానం ఉన్నదని, కళలు, సాహిత్యానికి ఇక్కడ కొదవలేదని, కొనిరెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తాను ఈ కార్యక్రమంలో ఇంత మంది కవులకు సన్మానం చేయటం అదృష్టంగా భావిస్తున్నానని, కొనిరెడ్డి ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రప్రధమంగా ఒకేసారి యాబై మంది కవులకు సన్మానం చేయటం తన పూర్వజన్మ సుకృతమని. కవులను సత్కరించి వారి మన్ననలు పొందే భాగ్యం తనకు కలగటం ఎంతో అదృష్టమని, సంస్థ సభ్యులు అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు.
కార్యక్రమానికి మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి జింకా వివిజయలక్ష్మి, టీటీడీ బోర్డు మెంబెర్ టంగుటూరి మారుతి ప్రసాద్, డా. ఎన్ ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments